ఆ విషయాన్ని దేవుడికే వదిలేస్తున్నా... నీరజ్ చోప్రా

by Geesa Chandu |

భారత్ లోని అత్యుత్తమ క్రీడాకారుడు, వరుసగా రెండు ఒలింపిక్స్ లలో స్వర్ణ, రజత పతకాలను సాధించిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా.. తనకు అందని ద్రాక్షగా ఉన్నటువంటి 90 మీటర్ల మార్క్ ను చేరుకోవడం పై, తానూ అతిగా ఆలోచించటం లేదని తెలిపాడు.

ఆ విషయాన్ని దేవుడికే వదిలేస్తున్నా... నీరజ్ చోప్రా
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ లోని అత్యుత్తమ క్రీడాకారుడు, వరుసగా రెండు ఒలింపిక్స్ లలో స్వర్ణ, రజత పతకాలను సాధించిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా.. తనకు అందని ద్రాక్షగా ఉన్నటువంటి 90 మీటర్ల మార్క్ ను చేరుకోవడం పై తానూ అతిగా ఆలోచించటం లేదని తెలిపాడు. అందరూ ఎక్కువగా చర్చిస్తున్న ఈ విషయాన్ని గురించి తానేమి బాధ పడటం లేదని, అయితే దీన్ని ఆ దేవుడికే వదిలేస్తున్నానని అన్నాడు. ఈ 90 మీటర్ల దూరం మార్కును చేరుకునేందుకు దీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్ లో 89.45 మీటర్లు విసిరి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. అయితే పాకిస్థాన్ కు చెందిన అర్షద్ నదీమ్ 92.97 మీటర్లు విసిరి ఒలింపిక్ రికార్డును బ్రేక్ చేసి, బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో నీరజ్ చోప్రా, నదీమ్ కు 3.52 మీటర్ల దూరంలో వెనకబడ్డాడు. అయితే 2022 లో 89.94 మీటర్లతో తన పర్సనల్ బెస్ట్ ను నమోదు చేసిన నీరజ్.. 90 మీటర్ల మార్కును ఎప్పుడు చేరుకుంటానో చెప్పలేనని తెలిపాడు. ఈ సందర్బంగా నీరజ్ మట్లాడుతూ.. "దీన్ని నేనిప్పుడు దేవుడికే వదిలేయాలి. నా వరకు బాగా ప్రిపేర్ అవ్వడం పైనే ప్రస్తుతం దృష్టి పెట్టాను. 90 మీటర్ల గురించి అయితే ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇప్పటికైతే ఆ చర్చను పక్కనపెడుతున్నాను. పారిస్ లోనే ఈ మార్కును అందుకుంటానని భావించాను. కానీ అది జరగలేదని, ఇప్పుడు మళ్లీ రాబోయే ఈవెంట్ లలో నా వంద శాతం ఇవ్వాలని అనుకుంటున్నాను. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం" అని వెల్లడించాడు నీరజ్ చోప్రా.

Next Story