ఆస్ట్రేలియా ఓపెన్‌ సెమీస్‌కు లక్ష్యసేన్.. ఆయుష్‌పై విజయం

by Phanindra |

ఆస్ట్రేలియా ఓపెన్‌ సెమీస్‌కు లక్ష్యసేన్ చేరుకున్నాడు. క్వార్టర్స్‌లో ఆయుష్‌పై విజయం సాధించాడు.

ఆస్ట్రేలియా ఓపెన్‌ సెమీస్‌కు లక్ష్యసేన్..  ఆయుష్‌పై విజయం
X

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. ఆస్ట్రేలియా ఓపెన్ సెమీఫైనల్స్ చేరుకున్నాడు. ఆయుష్ శెట్టితో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచులో లక్ష్యసేన్ అద్భుతంగా ఆడాడు. తొలి గేమ్‌లో 23-21 పోరాడి ఓడిన ఆయుష్.. రెండో గేమ్‌లో కనీసం పోటీ ఇవ్వలేకపోయాడు. దీంతో ఆ గేమ్‌ను 21-11తో నెగ్గిన లక్ష్యసేన్.. 53 నిమిషాల్లో ఆయుష్‌ను ఓడించి, సెమీస్‌లో అడుగు పెట్టాడు. ఈ టోర్నమెంటులో పురుషుల సింగిల్స్ విభాగంలో పోటీలో ఉన్న ఏకైక భారతీయుడు లక్ష్యసేన్ కావడం గమనార్హం. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ వంటి స్టార్లు గురువారమే టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో భారత మెడల్ ఆశలు కేవలం లక్ష్యసేన్‌పై మాత్రమే ఉన్నాయి. టోర్నీలో రెండో సీడ్ అయిన చైనీస్ తైపీ ప్లేయర్ చో టీన్ చెన్‌‌తో సెమీఫైనల్‌లో లక్ష్యసేన్ తలపడనున్నాడు. ఫర్హాన్ అల్వీతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో చెన్ 13-21, 23-21, 21-16 తేడాతో పోరాడి నెగ్గాడు.

సాత్విక్ జోడీ అవుట్

ఈ టోర్నీ నుంచి భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం తప్పుకుంది. హాంగాంక్ ఓపెన్ ఫైనల్స్ చేరి జోరుమీదున్న ఈ జోడీకి ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్, ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ షాకిచ్చారు. ఈ మ్యాచులో 21-19, 21-15 తేడాతో సాత్విక్-చిరాగ్ జోడీ ఓడింది.

Next Story