- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
68 ఏళ్ల తర్వాత.. వరల్డ్ రికార్డును సమం చేసిన కుల్దీప్
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. 26.5 ఓవర్లు వేసిన అతను 82 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం అతనికి ఇది 5వ సారి. దీంతో కుల్దీప్ టెస్టు క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 64 ఏళ్ల వరల్డ్ రికార్డును సమం చేశాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధికసార్లు 5 వికెట్లు ప్రదర్శన చేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ ఘనత ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ జానీ వార్డ్‌లే పేరిట ఉంది. వార్డ్‌లే 1957లో ఈ రికార్డు నెలకొల్పగా 68 ఏళ్ల తర్వాత కుల్దీప్ సమం చేశాడు.అయితే, వార్డ్‌లే 28 టెస్టుల్లో ఈ మైలురాయిని సాధిస్తే కుల్దీప్ కేవలం 15 టెస్టుల్లోనే అందుకోవడం విశేషం. వీరి తర్వాత స్థానంలో సౌతాఫ్రికా స్పిన్నర్ పాల్ ఆడమ్స్ ఉన్నాడు. అతను నాలుగుసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.






