Video: బుల్లెట్ లా దూసుకువ‌చ్చిన బంతి..లేడీ బుమ్రా అదిరిపోయే క్యాచ్‌

by velandi.Saikiran |

మ్యాచ్ లో లేడీ బుమ్రా క్రంతి గౌడ్ అద్భుతమైన క్యాచ్ అందుకుంది. దక్షిణాఫ్రికా ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ కొట్టిన స్ట్రేట్‌ డ

Video: బుల్లెట్ లా దూసుకువ‌చ్చిన బంతి..లేడీ బుమ్రా అదిరిపోయే క్యాచ్‌
X

దిశ‌, వెబ్ డెస్క్ : మహిళల ప్రపంచ కప్ 2025 టోర్నమెంటులో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో వరుసగా విజయం సాధించిన టీమిండియా మహిళల జట్టు, ఇవాళ దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 251 పరుగులు చేసింది. దీంతో చేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు టీమిండియా బౌలర్లు.

ఇక ఇప్పటికే 80 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడింది దక్షిణాఫ్రికా. అయితే ఈ మ్యాచ్ లో లేడీ బుమ్రా క్రంతి గౌడ్ అద్భుతమైన క్యాచ్ అందుకుంది. దక్షిణాఫ్రికా ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ కొట్టిన స్ట్రేట్‌ డ్రైవ్ షాట్ ను క్రంతి గౌడ్ ప‌ట్టేసుకుంది. బుల్లెట్ లా దూసుకు వచ్చిన ఆ బంతిని సింగిల్ హ్యాండ్ తో అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. క్లిక్

Next Story