- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విండీస్ టెస్టు కెప్టెన్‌గా తప్పుకున్న బ్రాత్‌వైట్
వెస్టిండీస్ టెస్టు కెప్టెన్సీ నుంచి క్రెగ్ బ్రాత్‌వైట్ తప్పుకున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్ టెస్టు కెప్టెన్సీ నుంచి క్రెగ్ బ్రాత్‌వైట్ తప్పుకున్నాడు. ఈ మేరకు తన రాజీనామాను క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ)కు అందజేశాడు. ఈ విషయాన్ని సీడబ్ల్యూఐ సోమవారం ధ్రువీకరించింది.‘టెస్టు కెప్టెన్‌గా బ్రాత్‌వైట్ అధికారికంగా వైదొలిగాడు. తన రాజీనామాను అందజేశాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు కొత్త నాయకత్వం కోసం సమయాన్ని ఇచ్చాడు. 100 టెస్టులకు అతను రెండు మ్యాచ్‌ల దూరంలో ఉన్నాడు. ఆసిస్‌తో సిరీస్ అతనికి స్పెషల్. అదనపు భారం లేకుండా బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నాడు.’ అని విండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్‌గా ప్రకటిస్తామని పేర్కొంది. అలాగే, వన్డే కెప్టెన్ షాయ్ హోప్‌కు టీ20 జట్టు పగ్గాలు కూడా అప్పగించింది. 2023 నుంచి పొట్టి ఫార్మాట్‌లో విండీస్‌ను నడిపిస్తున్న పొవెల్ స్థానంలో అతన్ని నియమించింది. టెస్టుల్లో బ్రాత్‌వైట్ నాయకత్వంలో 39 టెస్టులు ఆడిన విండీస్.. 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే, బ్రాత్‌వైట్ సారథిగా జట్టుకు కొన్ని అపురూప విజయాలు అందించాడు. 2022లో ఇంగ్లాండ్‌పై సిరీస్ నెగ్గిన కరేబియన్ జట్టు.. తేడాది గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాపై గెలుపొందింది.






