ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌.. టై బ్రేకర్‌తో తేలనున్న ఫలితం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-27 16:54:16  IST  )

ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ (FIDE Women World Cup) ఫైనల్స్ ఆసక్తికరంగా సాగుతోంది.

ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌.. టై బ్రేకర్‌తో తేలనున్న ఫలితం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ (FIDE Women World Cup) ఫైనల్స్ ఆసక్తికరంగా సాగుతోంది. ఫస్ట్ గేమ్ ను డ్రాగా ముగించిన భారత అమ్మాయిలు కోనేరు హంపి (Koneru Hampi), దివ్య దేశ్‌ముఖ్‌ (Divya Deshmukh)‌లు రెండో గేమ్‌ను కూడా డ్రా చేశారు. దీంతో తుది ఫలితం టై బ్రేకర్‌తోనే తేలనుంది. సోమవారం టై బ్రేకర్ అనంతరం.. విజేత ఎవరో తేలనుంది. కాగా.. ఫస్ట్ గేమ్‌ను నల్లపావుల్తో ఆడిన కోనేరు హంపి.. రెండో గేమ్ ను తెల్లపావుల్తో ఆడారు. దివ్య కూడా అదే స్థాయిలో పావుల్ని కదపడంతో.. గేమ్ డ్రా అయింది.

Next Story