ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో మెరిసిన తెలుగు తేజాలు.. ప్రశంసలు కురిపించిన సీఎంలు

by Ajay Maddhiboyina |

FIDE ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో కోనేరు హంపి, అర్జున్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. మహిళల విభాగంలో హంపీ కాంస్య పతకం సాధించారు.

ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో మెరిసిన తెలుగు తేజాలు.. ప్రశంసలు కురిపించిన సీఎంలు
X

దిశ‌, వెబ్ డెస్క్: FIDE ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో కోనేరు హంపి, అర్జున్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. మహిళల విభాగంలో హంపీ కాంస్య పతకం సాధించారు. మరోవైపు ఓపెన్ విభాగంలో అర్జున్ సైతం కాంస్యం గెలుచుకున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కోనేరు హంపి, అర్జున్‌ను ప్రశంసించారు. అసాధారణ నైపుణ్యం, పట్టుదల, పోటీతత్వం ప్రదర్శిస్తూ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ లో దేశానికి, తెలంగాణకు గర్వకారణంగా నలిచారంటూ ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మ‌రోవైపు ఏపీ సీఎం చంద్ర‌బాబు సైతం హంపీ, అర్జున్ ల‌ను ప్ర‌శంసించారు. ఒక్క ఫ‌లితంతో ఛాంపియ‌న్ల‌ను అంచనా వేయ‌లేమ‌ని పేర్కొన్నారు. అత్యున్న‌త స్థాయిలో ప‌దేప‌దే పోటీప‌డే ధైర్య‌మే వారిని నిల‌బెడుతుంద‌ని తెలిపారు. ప్ర‌పంచ వేదిక‌పై కాంస్యం సాధించ‌డం మీ నైపుణ్యానికి నిద‌ర్శ‌నం ప్ర‌శంసించారు. మీ ప్ర‌యాణం నిల‌క‌డ దేశంలోని ల‌క్ష‌లాది మందికి స్పూర్తినిస్తాయ‌ని పేర్కొన్నారు. పురుషుల్లో విశ్వ‌నాథ‌న్ ఆనంద్ త‌ర‌వాత ఈ ఘ‌నత సాధించిన ఏకైక భార‌త క్రీడాకారుడిగా అర్జున్ నిలిచాడ‌న్నారు.

Next Story