అన్న వచ్చాడోచ్.. మళ్లీ యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్ స్టా అకౌంట్

by Ajay Maddhiboyina |

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ రాత్రి నుండి కనిపించకుండా పోయింది. 27 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న కోహ్లీ అకౌంట్ కనిపించకుండా పోవడంతో అభిమానులు, ఫాలోవర్లు కంగారుపడ్డారు.

అన్న వచ్చాడోచ్.. మళ్లీ యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్ స్టా అకౌంట్
X

దిశ, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ రాత్రి నుండి కనిపించకుండా పోయింది. 27 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న కోహ్లీ అకౌంట్ కనిపించకుండా పోవడంతో అభిమానులు, ఫాలోవర్లు కంగారుపడ్డారు. అయితే ఇప్పుడు ఆయన అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అయింది. ఇప్పటి వరకు యూజర్ నాట్ ఫౌండ్ అని రాగా తిరిగి అకౌంట్ కనిపించడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అన్న వచ్చాడోచ్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇక కోహ్లీ ఇన్ స్టా కనిపించనంతసేపు తెగ కంగారుపడిపోయారు.

ట్విట్టర్ లో కనిపిస్తున్నా ఇన్ స్టాలో ఎందుకు మాయం అయ్యాడని ఆందోళన చెందారు. ఇన్ స్టాలో అనుష్కను ట్యాగ్ చేస్తూ వదినా అన్న అకౌంట్ కు ఏమైంది అంటూ ప్రశ్నించారు. ఇక అకౌంట్ తిరిగి రావడంతో టెక్నికల్ గ్లిచ్ కారణంగా విరాట్ ఇన్ స్టా మాయమైందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే ఇతరుల ఖాతాలు కూడా కనిపించకుండా పోవాలి కదా అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే కోహ్లీ లేదా ఇన్ స్టాగ్రామ్ స్పందించాల్సి ఉంది.

Next Story