కోహ్లీ పరువు తీసిన 14 ఏళ్ళ వైభవ్...!

by velandi.Saikiran |   (  Updated:2025-04-29 10:31:27  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో.. 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ( vaibhav suryavanshi)... ఇప్పుడు సోషల

కోహ్లీ పరువు తీసిన 14 ఏళ్ళ వైభవ్...!
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో.. 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ( vaibhav suryavanshi)... ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే...వైభవ్ సూర్య వంశీ గురించి మాత్రమే.. ఫోటోలు అలాగే పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ సాధించిన మరో రికార్డు బయటపడింది.

ఈ కుర్రాడు ఏకంగా విరాట్ కోహ్లీ (virat kohli) రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2025 టోర్నమెంటులో... ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్య వంశీ చరిత్ర సృష్టించాడు. అదే సమయంలో ఈ టోర్నమెంట్లో... ఎక్కువ బంతులు ఆడి... స్లోఎస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.

ఏకంగా 45 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ... 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కానీ.. వైభవ్ సూర్య వంశీ 17 బంతుల్లోనే.. తాజాగా 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. నిన్న గుజరాత్ మ్యాచ్ లో (Guajrat titans) 35 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. అయితే విరాట్ కోహ్లీ అలాగే 14 ఏళ్ల వైభవ్ మధ్య ఉన్న ఆట తీరును సోషల్ మీడియాలో చేస్తూ.. కోహ్లీని ట్రోలింగ్ చేస్తున్నారు కొంత మంది.

Next Story