- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్షర్ పటేల్ కాళ్లను పట్టుకోబోయిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా లీగ్ స్టేట్ లోని చివరి మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) 2025 లో భాగంగా లీగ్ స్టేట్ లోని చివరి మ్యాచ్ (Last match in league state) భారత్ (India,), న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య జరిగింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే వెంట వెంటనే కీలక వికెట్లను కోల్పోవడంతో పరుగుల కోసం భారత బ్యాటర్లు (Indian batters) చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అయ్యర్ 79, అక్షర్ పటేల్ 42, రాహుల్ 23, పాండ్య 45, పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయిన భారత్ 249 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 250 పరుగుల లక్ష్యంతో చేజింగ్ దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా అవుట్ అవుతున్నప్పటికి మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రం నిలకడగా రాణిస్తూ.. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. దీంతో అతన్ని అవుట్ చేయడానికి కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) జట్టులోని అందరూ బౌలర్లను ఉపయోగించాడు. అయినప్పటికి కేన్.. 50 సెంచరీ చేసి.. నిలకడగా రాణించాడు.
దీంతో ఒకానొక దశలో న్యూజిలాండ్ జట్టు ఓడి పోతుందేమోనన్న భయం నెలకొంది. ఈ క్రమంలో 41వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ (Akshar Patel) ఆ ఓవర్ లోని చివరి బంతికి కేన్ విలియమ్‌సన్ (Kane Williamson) ను అవుట్ చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (Virat Kohli).. చేసిన పనికి స్టేడియంలో ఉన్న ప్లేయర్లతో పాటు, ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. విలియమ్సన్ ను అవుట్ చేసిన అనంతరం విరాట్ కోహ్లీ వేగంగా అక్షర్ వద్దకు వచ్చి అతని కాళ్లను టచ్ చేయబోయాడు. ఇది గమనించిన అక్షర్ పటేల్ నవ్వుతూ.. విరాట్ కోహ్లీని గట్టిగా పట్టుకున్నాడు. అనంతరం ఇద్దరు ప్లేయర్లు పైకి లేచి.. జట్టు సభ్యులతో కలిసి సెలబ్రేషన్ చేసుకున్నారు. కాగా ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ సరదాగా అక్షర్ పటేల్ కాళ్లను టచ్ చేయడానికి ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది.






