Virat Kohli : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్..కోహ్లీకి అగ్ర‌స్థానం

by velandi.Saikiran |   (  Updated:2026-01-14 09:58:03  IST  )

ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ వెనక్కి నెట్టి, నాలుగు సంవత్సరాల తర్వాత మొదటి ప్లేస్ కు చేరుకున్నాడు కింగ్ కోహ్లీ.

Virat Kohli : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్..కోహ్లీకి అగ్ర‌స్థానం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్ జట్టుపై వన్డేల్లో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో కూడా నెంబర్ 1 స్థానానికి దూసుకు వెళ్ళాడు కోహ్లీ. మొన్న న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో అద్భుతంగా రాణించాడు కోహ్లీ.

కోహ్లీకి అగ్ర‌స్థానం

ఈ నేపథ్యంలోనే తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ వెనక్కి నెట్టి, నాలుగు సంవత్సరాల తర్వాత మొదటి ప్లేస్ కు చేరుకున్నాడు కింగ్ కోహ్లీ. అదే సమయంలో రెండవ స్థానానికి న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ చేరుకున్నాడు. మూడో స్థానంలో రోహిత్ శ‌ర్మ‌ నిలిచాడు. అటు భార‌త‌ ప్లేయర్లు గిల్ ఐదవ స్థానంలో నిలువగా, శ్రేయాస్ అయ్యర్ పదవ స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్ గా తన అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ 28 వేలకు పైగా పరుగులు చేసి రెండవ స్థానంలో నిలిచాడు. అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ చరిత్రలో 34,357 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Next Story