ధోనీ ఫామ్‌హౌస్‌లో భారత క్రికెటర్లకు విందు

by velandi.Saikiran |

ధోని భాయ్‌. అంతేకాదు గురువారం అర్ధరాత్రి విందు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వాళ్లకు సమాచారం ఇచ్చాడు.

ధోనీ ఫామ్‌హౌస్‌లో భారత క్రికెటర్లకు విందు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భార‌త మాజీ సార‌ధి మహేంద్రసింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా ఆయన చేసే పనులు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ధోని నవ్వినా, బైక్ పైన వెళ్లినా ఆ రోజంతా సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమోగుతుంది. అలాంటిది భారత క్రికెటర్లకు మహేంద్ర సింగ్ ధోని విందు ఏర్పాటు చేస్తే, వారం రోజులపాటు సోషల్ మీడియాలో ఈ అంశం గురించి చర్చించుకోవడం గ్యారెంటీ.

దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య మరో మూడు రోజుల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే మొదటి వన్డే మ్యాచ్ జార్ఖండ్ లోని రాంచీ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో రాంచీకి భారత వన్డే జట్టు సభ్యులందరూ చేరుకున్నారు. ఈ త‌రుణంలోనే మాజీ సార‌ధి మహేంద్రసింగ్ ధోని, వెంటనే భారత జట్టుకు సంబంధించిన ప్లేయర్లు అందరినీ కలిశాడు. వాళ్లు రాంచీలో బస చేస్తున్న హోటల్ కు వెళ్లి, కలిశాడు ధోని భాయ్‌. అంతేకాదు గురువారం అర్ధరాత్రి విందు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వాళ్లకు సమాచారం ఇచ్చాడు.

ఇక ధోని పిలవగానే ఎవరు వెళ్లకుండా ఉంటారు. గౌతమ్ గంభీర్ తప్ప మిగిలిన భారత వన్డే క్రికెట్ సభ్యులందరూ గురువారం రాత్రి ధోని ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా భారత ప్లేయర్ లందరికీ తేనేటి విందు ఏర్పాటు చేశారు ధోని. ఇక ఈ డిన్నర్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజు, రిషబ్ పంత్, మిగిలిన టీమిండియా ఆటగాళ్లందరూ ఉన్నారు. గురువారం అర్ధరాత్రి 11 గంటల వరకు ధోని ఫామ్ హౌస్ లోనే ఎంజాయ్ చేసిన భారత క్రికెటర్లు, ఆ తర్వాత రాంచీలోని తమ హోటల్ కు వెళ్ళిపోయారు. అయితే విరాట్ కోహ్లీని మాత్రం ధోని స్వయంగా హోటల్ దగ్గర డ్రాప్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.

Next Story