కేక్ క‌టింగ్ లో టీమిండియా ప్లేయ‌ర్లు..రోహిత్ ఎస్కేప్ !

by velandi.Saikiran |

దక్షిణాఫ్రికాపై భారత జట్టు వన్డే సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. విశాఖ వేదికగా చిట్ట చివరి వన్డే జరగగా, ఇందులో 9 వికెట్ల

కేక్ క‌టింగ్ లో టీమిండియా ప్లేయ‌ర్లు..రోహిత్ ఎస్కేప్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దక్షిణాఫ్రికాపై భారత జట్టు వన్డే సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. విశాఖ వేదికగా చిట్ట చివరి వన్డే జరగగా, ఇందులో 9 వికెట్ల తేడాతో భారత జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో 2-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు. ఇక ఈ విజయంతో భారత జట్టు శిబిరంలో సంబరాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే విశాఖలో భారత జట్టు బస చేసిన హోటల్ లో కేక్ కటింగ్ సంబరాలు కూడా జరిగాయి. ఫోటో యాజమాన్యం విరాట్ కోహ్లీతో కేక్ కటింగ్ చేయించాలని ప్లాన్ చేసింది. అయితే కోహ్లీ ఆ కేక్ కట్ చేయకుండా, సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ చేత చేయించాడు. అనంతరం యశస్వి జైస్వాల్ పెట్టిన కేక్ ను విరాట్ కోహ్లీ తిన్నాడు.

అనంతరం రోహిత్ శ‌ర్మ‌కు పెట్టే ప్రయత్నం చేశాడు జైష్వాల్. దీంతో అక్కడి నుంచి వెంటనే రోహిత్ శర్మ ఎస్కేప్ అయ్యాడు. తాను ఇప్పుడు కేకులు, వడపావులు అస్సలు ముట్టుకోవడం లేదంటూ మెల్లగా జారుకున్నాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడే లక్ష్యంతో రోహిత్ శర్మ బరువు తగ్గిన సంగతి తెలిసిందే. దానికోసం తనకి ఇష్టమైన ఫుడ్ మొత్తం మానేశాడు. డైటింగ్ చేస్తూ దాదాపు 20 కేజీల వరకు తగ్గిపోయాడు రోహిత్ శర్మ. అందుకే తాజాగా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ నుంచి ఎస్కే పోయాడు. క్లిక్

Next Story