- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ గుడ్‌బై.. ఇంగ్లాండ్ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు
రెడ్ బాల్ క్రికెట్‌కు టీమిండియా (Team India) స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గుడ్ బై చెప్పిన విషయం విదితమే.

దిశ, వెబ్‌డెస్క్: రెడ్ బాల్ క్రికెట్‌కు టీమిండియా (Team India) స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గుడ్ బై చెప్పిన విషయం విదితమే. అయితే, పలు దేశాల ప్రఖ్యాత ఆటగాళ్లు ఆయన రిటైర్మెంట్‌పై సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి వైదోలగడంపై ఇంగ్లాండ్ స్పిన్నర్ మాంటి పనేసర్ (Monty Panesar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ టూర్ (England Tour) నేపథ్యంలో అతడికి జట్టులో చోటు కల్పించలేమని చెప్పినందునే కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడని కామెంట్ చేశాడు. ఇంగ్లండ్ టూర్‌కు కోహ్లీ వస్తాడని తాను కూడా భావించానని.. కానీ, అనూహ్యంగా రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఇంగ్లండ్ లాంటి జట్టును ఎదర్కోలేకనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అన్నారు. ప్రస్తుతం మాంటి పసేసర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.






