- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCB విక్టరీ.. కోహ్లీ ఆలా.. అనుష్క ఇలా.. ఇద్దరూ ఇద్దరే
ఐపీఎల్ 2025 టోర్నమెంటులో (ipl 2025) క్వాలిఫైయర్ 1 లోకి ( Qualifier 1) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( rcb) దూసుకు

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంటు లో (ipl 2025) క్వాలిఫైయర్ 1 లోకి ( Qualifier 1) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( rcb) దూసుకు వెళ్ళింది. లక్నోతో జరిగిన లీగ్ దశ చివరి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ దెబ్బకు.. పాయింట్ల పట్టికలో నెంబర్ 2 కు దూసుకు వెళ్ళింది బెంగళూరు.
ఇక క్వాలిఫైయర్ 1 లో పంజాబ్ కింగ్స్ ( PBKS) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చండీఘర్ వేదికగా నిర్వహించబోతున్నారు. ఇది ఇలా ఉండగా.. లక్నోపై విజయం సాధించిన తర్వాత... విరాట్ కోహ్లీ ( VIRAT KOHLI) అలాగే అనుష్క శర్మ ( ANUSHKA SHARMA) ఇద్దరూ చేసుకున్న సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
మ్యాచ్ గెలిచే సమయానికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి కోహ్లీ చిందులు వేశాడు. మెట్ల పై నుంచే.. చిన్నపిల్లడిలా గంతులు వేస్తూ.. గ్రౌండ్ లోకి వచ్చాడు. అటు.. స్పెషల్ గ్యాలరీలో కూర్చున్న.. కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా.. తన ఫ్రెండ్స్ కు హగ్గులిస్తూ బెంగళూరు విజయాన్ని ఆస్వాదించారు. అటు విరాట్ కోహ్లీకి కూడా సైగలు చేస్తూ రచ్చ చేశారు అనుష్క శర్మ.






