కేఎల్ రాహుల్ కు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌, ఇక‌ కెప్టెన్ అవ‌తారం..?

by velandi.Saikiran |

కేఎల్ రాహుల్ పైన కన్నేసింది కేకేఆర్. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు రాహుల్. అ

కేఎల్ రాహుల్ కు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌, ఇక‌ కెప్టెన్ అవ‌తారం..?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 టోర్నమెంటులో ఈసారి టైటిల్ గెలవాలన్న లక్ష్యంతో కేకేఆర్ దూసుకు వెళ్తోంది. తమ పాత ప్లేయర్లను వదిలేసి కొత్త ప్లేయర్లను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. డిసెంబర్ లో మినీ వేలం జరగనున్న నేపథ్యంలో కొత్త ప్లేయర్లను రంగంలోకి దించనుందట. చాలా మందిని జట్టులోంచి రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

అయితే ఇలాంటి నేపథ్యంలో కేఎల్ రాహుల్ పైన కన్నేసింది కేకేఆర్. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు రాహుల్. అయితే అతన్ని ట్రేడ్ ద్వారా జట్టులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ ను జట్టులోకి తీసుకొని, కెప్టెన్ కూడా చేయాలన్నది కేకేఆర్ ప్లాన్. గత సీజన్ లో రహానే కెప్టెన్ గా ఉన్నాడు. పెద్దగా రిజల్ట్ రాలేదు. అందుకే కె.ఎల్ రాహుల్ పై కన్నేసింది కేకేఆర్. ఇక ఇందులో భాగంగానే నిన్న కేఎల్ రాహుల్ తో చర్చలు కూడా జరిగాయట. అన్ని ఓకే అయితే అధికారిక ప్రకటన కూడా రానుంది. కాగా డిసెంబర్ 15వ తేదీన ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.

Next Story