- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉండటం చాలా కష్టం : కేఎల్ రాహుల్
భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 2022-24 వరకు అతను లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథిగా వ్యవహరించాడు. 2024లో హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమి అనంతరం ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా.. రాహుల్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. అప్పుడు గోయెంకా వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐపీఎల్‌లో కెప్టెన్ ఎదుర్కొనే సవాళ్లను కేఎల్ రాహుల్ వివరించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉండటం చాలా కష్టతరమన్నాడు.
ఓనర్ల నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాడు. ‘కెప్టెన్‌గా ఉండటం నాకు చాలా కష్టమనిపించింది. ఎన్నో సమావేశాలు, సమీక్షలు నిర్వహించాలి. యాజమాన్య స్థాయిలో ఉన్న వారికి ఎన్నో విషయాలపై వివరణ ఇవ్వాలి. ఎంతో శక్తిని కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఐపీఎల్ ముగిసే నాటికి 10 నెలలు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం కంటే మానసికంగా, శారీరకంగా కుంగిపోయానని గ్రహించా.’అని రాహుల్ తెలిపాడు.
అలాగే, క్రీడా నేపథ్యంలేని వారికి జవాబుదారీగా ఉండటం చాలా కష్టమని చెప్పాడు. ‘కెప్టెన్లు, కోచ్‌లను చాలా విషయాల గురించి ప్రశ్నలు అడుగుతారు. ఒక దశ తర్వాత ఈ మార్పు ఎందుకు చేశారు?. అతన్ని తుది జట్టులోకి ఎందుకు తీసుకున్నారు? ప్రత్యర్థి 200 రన్స్ చేస్తే మనం కనీసం 120 రన్స్ ఎందుకు చేయలేదు?. ఆ జట్టు బౌలర్లు ఎక్కువ స్పిన్ ఎలా వేయగలుగుతున్నారు?.. ఇలా చాలా ప్రశ్నలు అడుగుతారు. ఏడాది పొడువునా ఇలాంటి ప్రశ్నలు మనం ఎదుర్కోం. కోచ్‌లు, సెలెక్టర్లు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్లు క్రికెట్ ఆడారు. క్రీడలో గెలుపుపై గ్యారంటీ ఇవ్వలేం. క్రీడేతర నేపథ్యం నుంచి వచ్చిన వారికి వివరించడం చాలా కష్టం’అని రాహుల్ వివరించాడు.






