KL Rahul 2.0: 106 డిగ్రీల జ్వ‌రంతో మ్యాచ్ ఆడిన‌ కేఎల్ రాహుల్‌ !

by velandi.Saikiran |

KL Rahul 106 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి ఇరగదీశాడు.

KL Rahul 2.0:  106 డిగ్రీల జ్వ‌రంతో మ్యాచ్ ఆడిన‌ కేఎల్ రాహుల్‌ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : కేఎల్‌ రాహుల్... టీమిండియా కోసం తన ప్రాణాలైనా ఇచ్చేలా కనిపిస్తున్నాడు. జ్వరం వచ్చినా కూడా బ్యాటింగ్ చేసి టీమిండియాను గెలిపించాడు. టీమిండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య రెండవ అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఏ జట్టు 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 11 పరుగులతో విఫలమైన కే ఎల్ రాహుల్.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం 176 పరుగులు చేసి టీమ్ ఇండియాను గెలిపించాడు. 106 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి ఇరగదీశాడు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 420 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 185 పరుగులు చేసింది. అటు టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 194 పరుగులకు అలౌటై... రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు నష్టపోయి 413 చేసి విజయం సాధించింది.

Next Story