కెఎల్ రాహుల్ సెంచరీ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే ?

by velandi.Saikiran |   (  Updated:2025-05-18 15:54:00  IST  )

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కె ఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ తో దుమ్ము లేపాడు. ఇవాళ గుజరాత్ వర్సెస్

కెఎల్ రాహుల్ సెంచరీ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కె ఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ తో దుమ్ము లేపాడు. ఇవాళ గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో... భీకరమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు కేఎల్ రాహుల్. ఈ తరుణంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు రాహుల్. దీంతో ఇప్పటి వరకు ఐపీఎల్ టోర్నమెంట్ లో 5 సెంచరీలు పూర్తి చేసుకున్న ప్లేయర్ గా రికార్డులోకి ఎక్కాడు.

కేవలం 60 బంతుల్లోనే కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక అటు... ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో... మూడు వికెట్లు నష్టపోయి.. 199 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేయాల్సి ఉంటుంది.

Next Story