సచిన్, కోహ్లీ రికార్డులను సమం చేసిన రాహుల్

by Harish |

ఇంగ్లాండ్‌లో సత్తాచాటుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఖాతాలో మరో రికార్డు చేరింది.

సచిన్, కోహ్లీ రికార్డులను సమం చేసిన రాహుల్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌లో సత్తాచాటుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఖాతాలో మరో రికార్డు చేరింది. టెస్టుల్లో ఇంగ్లాండ్ గడ్డపై 1,000 రన్స్ పూర్తి చేసి భారత దిగ్గజాల సరసన నిలిచాడు. భీకర ఫామ్‌లో ఉన్న రాహుల్ నాలుగో టెస్టులో కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. 98 బంతుల్లో 46 రన్స్ చేశాడు. దీంతో రాహుల్ ఇంగ్లాండ్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. సునీల్ గవాస్కర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత ఓపెనర్‌గా ఘనత సాధించాడు. మొత్తంగా ఐదో భారత బ్యాటర్. సచిన్ టెండూల్కర్(1,575), రాహుల్ ద్రవిడ్(1,376), సునీల్ గవాస్కర్(1,152), విరాట్ కోహ్లీ(1096) సరసన రాహుల్ నిలిచాడు. ఇంగ్లాండ్ 12 టెస్టులు ఆడిన రాహుల్ నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.


Next Story