- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంగ్లాండ్ తో టెస్ట్.. అంపైర్ తో కేఎల్ రాహుల్ గొడవ
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇంగ్లాండ్ అలాగే టీమ్ ఇండియాకు

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇంగ్లాండ్ అలాగే టీమ్ ఇండియాకు చాలా కీలకంగా మారిన ఐదవ టెస్టులో... రెండు జట్ల ప్లేయర్లు కసిగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ప్లేయర్ల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే, నిన్న ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో అంపైర్ ధర్మసేన అలాగే కేఎల్ రాహుల్ మధ్య గొడవ జరిగింది.
ధర్మసేనపై కేఎల్ రాహుల్ కాస్త సీరియస్ అయ్యారు. రూట్ అలాగే ప్రసీద్ కృష్ణ మధ్య వివాదం జరుగగా రాహుల్ మద్దతుగా వెళ్లారు. ఆ సందర్భంగా ధర్మసేన ఆపే ప్రయత్నం చేశారు. దీంతో కాస్త రాహుల్ సీరియస్ అయ్యారు. గొడవ జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ చేసి ఇంటికి వెళ్ళమంటారా? అని ధర్మసేనపై ఆగ్రహం వ్యక్తం చేశారు కే ఎల్ రాహుల్. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. అంతకుముందు భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ ప్లేయర్లకు సపోర్ట్ గా ధర్మసేన సిగ్నల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.






