- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్డే కెప్టెన్ గా KL రాహుల్.. వైస్ కెప్టెన్ ఎవరంటే?
వన్డే సిరీస్ కు కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ అయ్యర్ ఇద్దరూ దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. మెడ నొప్పి కారణంగా గిల్,

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న భారత్, అతి త్వరలోనే వన్డే సిరీస్ కూడా ఆడనుంది. నవంబర్ 30వ తేదీ నుంచి ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టును ప్రకటించే యోచనలో బీసీసీఐ పెద్దలు ఉన్నారు. అయితే ఈ వన్డే సిరీస్ కు కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ అయ్యర్ ఇద్దరూ దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. మెడ నొప్పి కారణంగా గిల్, ఆస్ట్రేలియాలో గాయపడి అయ్యర్ ఇద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వన్డే సిరీస్ లో వాళ్ళిద్దరూ ఆడకపోవచ్చు. అదే జరిగితే టీమిండియా కెప్టెన్ గా కేఎల్ రాహుల్ పేరును ఖరారు చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. లేదా రిషబ్ పంత్ కు అవకాశం ఇవ్వనున్నారు. ఇద్దరిలో ఒకరు కెప్టెన్ అయితే, మరొకరికి తాత్కాలిక వైస్ కెప్టెన్సీ పదవి దక్కనుంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి.






