రిటైర్మెంట్ పై కేఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్స్‌

by velandi.Saikiran |

నన్ను నేను సూపర్ స్టార్ అని అస్సలు అనుకోను.. టీమిండియాలో స్టార్ ఆటగాడిని అని కూడా అనుకోవట్లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు కేఎల్ రాహుల్.

రిటైర్మెంట్ పై కేఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రిటైర్మెంట్ గురించి పేర్కొంటూ, అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన రిటైర్మెంట్ కు ఇంకా సమయం ఉందని కేఎల్ రాహుల్ వెల్లడించారు. ఇక ఆ సమయం వచ్చినప్పుడు దిగిపోవడమేనని, అస్సలు వెనకడుగు వేయబోనని సంచలన ప్రకటన చేశారు. రిటైర్మెంట్ గురించి ఇప్ప‌టికే ఆలోచించాను.. అది అంత కష్టమైనది కాదని వెల్లడించారు.

నన్ను నేను సూపర్ స్టార్ అని అస్సలు అనుకోను.. టీమిండియాలో స్టార్ ఆటగాడిని అని కూడా అనుకోవట్లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు కేఎల్ రాహుల్. జీవితంలో ఇంతకన్నా ముఖ్యమైన విషయాలు కూడా ఉంటాయని వెల్లడించారు. రిటైర్మెంట్ సమయానికి కచ్చితంగా చెబుతానంటూ స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాగా కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో అత‌ని ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.

Next Story