IPL 2025 : క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. ఆ మ్యాచ్ వాయిదా

by Muthe.Rajitha |

ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులకు ఓ బ్యాడ్ న్యూస్.

IPL 2025 : క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. ఆ మ్యాచ్ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులకు ఓ బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ లో జరగాల్సిన ఓ మ్యాచ్ ను వాయిదా వేస్తూ బీసీసీఐ(BCCI) నిర్ణయం తీసుకుంది. మార్చ్ 6, ఆదివారం నాడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌(Kolkata Eden Gardens)లో జరగాల్సిన మ్యాచ్ ను భద్రతా కారణాల వల్ల వాయిదా(Security Reasons) వేసినట్టు తెలిపింది. కోల్‌కతా పోలీసులు నగరంలో జరిగే పండుగల కారణంగా తగినంత పోలీసులను సమకూర్చలేమని, భద్రతా కారణాల వలన మ్యాచ్ వాయిదా వేయాలని బీసీసీఐని కోరారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆరోజు జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జయింట్స్ (KKR vs LSG) మధ్య మ్యాచ్ ను తరువాతి రెండు రోజులకు వాయిదా వేసింది.

తిరిగి ఆ మ్యాచ్ ను మార్చ్ 8, మంగళవారం నాడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరపనున్నారు. అయితే ఆరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా ఒక మ్యాచ్ మాత్రమే వాయిదా పడింది. అదే రోజు జరగనున్న హైదరాబాద్ సన్ రైజర్స్ vs గుజరాత్ జెయింట్స్(SRH vs GT) మధ్య మ్యాచ్ మాత్రం యథాతథంగా జరుగుతుందని వెల్లడించింది. ఇక మంగళవారం జరగనున్న PBKS vs CSK మ్యాచ్ లో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని ప్రకటించింది.

Next Story