- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KKR కీలక నిర్ణయం.. ఈసారి ఏకంగా 5 గురు కోచ్ లతో భారీ ప్లాన్!
ఐపీఎల్ 2025లో దారుణంగా విఫలమైన కేకేఆర్... ఐపీఎల్ 2026 పై దృష్టి పెట్టింది. మరోసారి ఛాంపియన్ గా నిలిచేందు

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025లో దారుణంగా విఫలమైన కేకేఆర్... ఐపీఎల్ 2026 పై దృష్టి పెట్టింది. మరోసారి ఛాంపియన్ గా నిలిచేందుకు ఇప్పటినుంచి కసరత్తులు చేస్తోంది కేకేఆర్. దీనికోసం బలమైన ప్లేయర్లతోపాటు... కోచింగ్ స్టాఫ్ ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఏకంగా... ఐదుగురు కోచింగ్ స్టాఫ్ ను రంగంలోకి దింపేందుకు కేకేఆర్ నిర్ణయం తీసుకుందట.
గతంలో గౌతమ్ గంభీర్ సారధ్యంలో చాంపియన్ గా నిలిచింది కేకేఆర్. వచ్చే సీజన్ లో కూడా అలాగే ఛాంపియన్ కావాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం హెడ్ కోచ్ గా ఇయాన్ మోర్గాన్ ను తీసుకోబోతున్నారట. అసిస్టెంట్ కోచ్గా అభిషేక్ నాయర్ ఎప్పటిలాగే కొనసాగనున్నాడు. ఇక బ్యాటింగ్ కోచ్ గా హషీం ఆమ్లా ఈ సారి బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి.
అలాగే బౌలింగ్ కోచ్ గా డేల్ స్టేయిన్ రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మెంటర్ గా ఇర్ఫాన్ పఠాన్ దించుతున్నారట. ఇలా మొత్తం ఐదుగురు కోచింగ్ స్టాఫ్ తో... కేకేఆర్ రెడీ అవుతుందని అంటున్నారు. అదే సమయంలో వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్లను.. వదిలేసి ట్రేడ్ ద్వారా ఇతర జట్ల నుంచి మంచి ప్లేయర్లను తెచ్చుకోవాలని అనుకుంటున్నారట.






