భారత ‘ఏ’ జట్టులోకి కేకేఆర్ స్టార్.. ట్రై సిరీస్‌కు ఎంపిక చేసిన బీసీసీఐ

by Harish |

భారత ‘ఏ’ జట్టులోకి కేకేఆర్ స్టార్.. ట్రై సిరీస్‌కు ఎంపిక చేసిన బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకలో జరిగే ట్రై సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఏ’ జట్టుకు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్, జార్ఖండ్ యువ ప్లేయర్ అనుకుల్ రాయ్ ఎంపికయ్యాడు. హర్ష్ దూబె స్థానంలో అనుకుల్ రాయ్‌ను సెలెక్ట్ చేసినట్టు బీసీసీఐ గురువారం వెల్లడించింది. ఇటీవలే ఆ సిరీస్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీలో బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఆ టీమ్‌లో ఉన్న హర్ష్ దూబె అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు, వన్డే సిరీ‌స్‌కు ప్రకటించిన సీనియర్ జట్టులో కూడా స్థానం సంపాదించాడు. భారత్, శ్రీలంక, అఫ్గాన్ ‘ఏ’ జట్ల మధ్య జూన్ 9 నుంచి 21 వరకు ట్రై సిరీస్ జరగనుంది. అదే సమయంలో భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్టు, వన్డే సిరీస్ షెడ్యూల్ ఉంది. దీంతో భారత ‘ఏ’ జట్టు నుంచి హర్ష్ దూబెను బీసీసీఐ రిలీజ్ చేసింది. అతని స్థానంలో అనుకుల్ రాయ్‌ను సెలెక్ట్ చేసింది. ఐపీఎల్-2026లో కేకేఆర్ తరపున అనుకుల్ రాయ్ 11 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీశాడు.


Next Story