బీసీసీఐ ఆదేశాలతో.. బంగ్లాదేశ్ బౌలర్ పై సంచలన నిర్ణయం తీసుకున్న కేకేఆర్

by Malleboina Mahesh |

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

బీసీసీఐ ఆదేశాలతో.. బంగ్లాదేశ్ బౌలర్ పై సంచలన నిర్ణయం తీసుకున్న కేకేఆర్
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, హిందూ మైనార్టీల (Hindu minorities)పై దాడులు జరుగుతున్నాయి. దీంతో భారత దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ మ్యాచుల్లో బంగ్లాదేశ్ ప్లేయర్లను తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్‌ (Mustafizur Rahman)ను జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ కేకేఆర్ జట్టుకు సూచించింది. దీనిపై స్పందించిన కేకేఆర్ యాజమాన్యం, బీసీసీఐ/ఐపీఎల్ నిబంధనల మేరకు ముస్తఫిజుర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు శనివారం (జనవరి 3, 2026) అధికారికంగా ప్రకటించింది.

గత డిసెంబర్‌లో జరిగిన మినీ వేలం (Mini Auction)లో కేకేఆర్ ఇతడిని రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింస నేపథ్యంలో, ఆ దేశ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడించకూడదని పలు రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కేకేఆర్ కో-ఓనర్ షారుఖ్ ఖాన్‌పై కూడా ఈ విషయంలో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముస్తఫిజుర్‌ను విడుదల చేసినందుకు ప్రతిగా, కేకేఆర్ జట్టు మరొక కొత్త ఆటగాడిని (Replacement) ఎంచుకోవడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన ఏకైక ఆటగాడు ముస్తాఫిజుర్ మాత్రమే కావడం గమనార్హం.

Next Story