రోహిత్ శర్మ ఫ్యాన్ ను ర్యాగింగ్ చేసిన KKR...!

by velandi.Saikiran |   (  Updated:2025-04-03 15:11:20  IST  )

ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) ఫ్యాన్స్ కు ఘోర అవమానం జరిగింది. రోహిత్ శర

రోహిత్ శర్మ ఫ్యాన్ ను ర్యాగింగ్ చేసిన KKR...!
X

దిశ, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) ఫ్యాన్స్ కు ఘోర అవమానం జరిగింది. రోహిత్ శర్మ వికెట్ కోల్పోవడంతో.. అతని అభిమానిని ర్యాగింగ్ చేశారు కేకేఆర్ అభిమానులు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. సోమవారం అంటే మార్చి 31వ తేదీన ముంబై ఇండియన్స్ వర్సెస్ కోలకత్తా రైడర్స్ ( Mumbai Indians vs Kolkata Riders ) జట్ల మధ్య 12వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ తరుణంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది ముంబై ఇండియన్స్. అయితే ముంబై ఇండియన్స్ గెలిచింది కానీ ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇంకా గాడిలో పడలేదు.

ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడింది ముంబై ఇండియన్స్. ఈ మూడు మ్యాచ్ లలో కూడా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. మొదటి మ్యాచ్ లో డక్ అవుట్ అయితే... రెండవ మ్యాచ్ లలో 4 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కేకేఆర్ జట్టు పైన కూడా విఫలమయ్యాడు రోహిత్ శర్మ. 12 బంతుల్లో. 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఒక సిక్సర్ కూడా కొట్టాడు. అనంతరం వికెట్ సమర్పించుకున్నాడు రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మ వికెట్ పడిపోవడంతో... ఆయన అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఈ తరుణంలోనే రోహిత్ శర్మ పేరుతో.. శరీరం మొత్తం బ్లూ రంగు వేసుకున్న అభిమాని ( Rohit Sharma fan ) .. కూడా పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్న కేకేఆర్ అభిమాని... రోహిత్ శర్మ ఫ్యాన్ ను ర్యాగింగ్ చేశాడు. అతన్ని చూస్తూ పగలబడి నవ్వాడు. రోహిత్ శర్మ ఔట్ అయ్యాడని టీజింగ్ కూడా చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Click For Twitter Post..

Next Story