KKRలోకి kl రాహుల్.... అదిరిపోయే ప్లాన్ ఇదే!

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ( IPL 2026) టోర్నమెంట్ కంటే ముందు.. హడావిడి మొదలవుతోంది. ఐపీఎల్ ట్రేడ్ డీల్ ప్రక్రియ

KKRలోకి kl రాహుల్.... అదిరిపోయే ప్లాన్ ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ( IPL 2026) టోర్నమెంట్ కంటే ముందు.. హడావిడి మొదలవుతోంది. ఐపీఎల్ ట్రేడ్ డీల్ ప్రక్రియ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కె ఎల్ రాహుల్ కు ( KL Rahul) బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ కంటే ముందు రాహుల్ ను ట్రేడ్ డీల్ ద్వారా కొనుగోలు చేసేందుకు కేకేఆర్ యాజమాన్యం (KKR) ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆయనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని కూడా కేకేఆర్ టీం యాజమాన్యం... భావిస్తోందట. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కేఎల్ రాహుల్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 13 మ్యాచులలో ఏకంగా 539 పరుగులు సాధించాడు రాహుల్. అందుకే అతన్ని తీసుకొని కెప్టెన్ చేయాలని కేకేఆర్ భావిస్తోందట. అయితే దీనికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం ఒప్పుకుంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఐపిఎల్ 2025 టోర్నమెంట్ లో కేకేఆర్ కెప్టెన్ గా రహానే వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Next Story