- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCBలోకి ఆండ్రీ రస్సెల్...ధర ఎంతంటే ?
RCBలోకి ఆండ్రీ రస్సెల్...ధర ఎంతంటే ఇది ఇలా ఉండగా, ఐపీఎల్ 2025 మినీ వేలం డిసెంబర్ 16న జరుగనుందట.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ సంచలన నిర్ణయం తీసుకుంది. విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ను వేలంలో వదిలేసింది కేకేఆర్. గత సీజన్ లో ఆండ్రీ రస్సెల్ ను రిటైన్ చేసుకున్న కేకేఆర్, ఇప్పుడు అతన్ని వదిలేసింది. 2014 ఐపీఎల్ సమయంలో కేకేఆర్ జట్టులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్, జట్టుకు 11 సంవత్సరాల పాటు సేవలు అందించాడు. అనేక విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇక ఇప్పుడు వేలంలోకి వచ్చాడు ఆండ్రీ రస్సెల్. దీంతో ఈ మినీ వేలంలో ఆండ్రీ రస్సెల్ ను ఎలాగైనా కొనుగోలు చేసేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సిద్ధమవుతోందట. ఏకంగా రూ.12 కోట్లు పెట్టి మరీ, ఆండ్రీ రస్సెల్ ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మిడిలార్డర్ ను మెరుగుపరుచుకునేందుకు ఈ స్కెచ్ వేసిందట బెంగళూరు. ఇది ఇలా ఉండగా, ఐపీఎల్ 2025 మినీ వేలం డిసెంబర్ 16న జరుగనుందట.






