- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8 సిక్సర్లు, 3 బౌండరీలతో రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాటర్, రికార్డు బ్రేక్ విజయం
బిగ్ బాష్ లీగ్ 2025-26 టోర్నమెంట్ లో కేకేఆర్ ఆటగాడు ఫిన్ అలెన్ దుమ్ములేపాడు. మొన్నటి ఐపీఎల్ మినీ వేలంలో పా

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాష్ లీగ్ 2025-26 టోర్నమెంట్ లో కేకేఆర్ ఆటగాడు ఫిన్ అలెన్ దుమ్ములేపాడు. మొన్నటి ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొన్న ఫిన్ అలెన్, ఇవాళ బ్యాటింగ్ లో అదరగొట్టాడు. బ్రిస్బేన్ హీట్ vs పెర్త్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 38 బంతుల్లోనే 79 పరుగులు సాధించి తన సత్తా చాటాడు. ఇందులో 8 సిక్సర్లు, 3 బౌండరీలు కూడా ఉన్నాయి. ఫిన్ అలెన్ తో పాటు కూపర్ కొన్నోలీ కూడా రాణించాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్, 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టపోయి 257 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని బ్రిస్బేన్ హీట్ అవలీలగా ఛేదించేసింది. జాక్ వైల్డర్ముత్, మ్యాట్ రెన్షా ఇద్దరూ సెంచరీలు చేయడంగా, కేవలం 2 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పెర్త్ స్కార్చర్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది బ్రిస్బేన్ హీట్. కాగా ఫిన్ అలెన్ ను మొన్నటి వేలంలో రూ.2 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
- Tags
- KKR
- Finn Allen
- bbl






