కింగ్ కోహ్లీకి టీమిండియా 'గార్డ్ ఆఫ్ హానర్'!!

by Disha Web Desk 20 |
కింగ్ కోహ్లీకి టీమిండియా గార్డ్ ఆఫ్ హానర్!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః శనివారం మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో ఇండియా- శ్రీలంకల తొలి టెస్టులో 2వ రోజు మ్యాచ్ ఉత్సాహంగా ప్రారంభ‌మ్యింది. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా విరాట్ కోహ్లీకి టీమిండియా 'గార్డ్ ఆఫ్ హానర్' ఇచ్చి గౌర‌వించారు. కింగ్ కోహ్లీ 100వ టెస్టు ఆడుతున్న సంద‌ర్భంగా రోహిత్ శర్మ జట్టు త‌మ మాజీ కెప్టెన్‌కు అద్భుతంగా స్వాగతం ప‌లికారు. కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టగానే భారత ఆటగాళ్లు వరుసలో నిలబడి చప్పట్లు కొట్టారు. అతను తన కుడి చేతిని గాల్లో లేపి, తోటి టీమ్ స‌భ్యులు ఇస్తున్న గౌర‌వాన్ని స్వీక‌రించాడు. ముఖంలో సంభ్ర‌మానందంతో కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇక‌, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, ఇషాంత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ తర్వాత 100 టెస్ట్‌లకు 'గార్డ్ ఆఫ్ హానర్' పొందిన‌ 12వ భారతీయ క్రికెట‌ర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.



Next Story

Most Viewed