కోహ్లీ షాకింగ్ నిర్ణయం.. 300 కోట్లు నష్టం !

by velandi.Saikiran |

రాయల్ చాలెంజర్ బెంగళూరు ( Royal Challenger Bangalore ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సంచలన నిర్ణయం తీసుకున

కోహ్లీ షాకింగ్ నిర్ణయం.. 300 కోట్లు నష్టం !
X

దిశ, వెబ్ డెస్క్: రాయల్ చాలెంజర్ బెంగళూరు ( Royal Challenger Bangalore ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం దెబ్బకు... విరాట్ కోహ్లీకి ( Virat Kohli) 300 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఓ ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్ గా ( Brand Ambassador ) ఉన్న విరాట్ కోహ్లీ... వాళ్లు ఇచ్చిన బంపర్ ఆఫర్ ను వదులుకున్నాడు. దీంతో దాదాపు 300 కోట్లు విరాట్ కోహ్లీ కి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే... గత కొన్ని రోజులుగా Puma అనే బ్రాండ్ కు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. అయితే.. ఈ బ్రాండ్ అంబాసిడర్ ఆఫర్ ను మరో ఎనిమిది సంవత్సరాల పాటు పొడగించేందుకు పూమా నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు 300 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది పూమా ( Puma) కంపెనీ. కానీ విరాట్ కోహ్లీ మాత్రం... ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. తాను ఇక పైన puma కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోనని.. తేల్చి చెప్పాడు విరాట్ కోహ్లీ. 300 కోట్లు కాదు 500 కోట్లు ఇచ్చినా కూడా.. తాను ఉండబోనని స్పష్టం చేశాడట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story