London: ప్రాక్టీస్ కు డుమ్మా..కోహ్లీ ఇంట్లో టీమిండియా ప్లేయర్ల దావత్ !

by velandi.Saikiran |

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య అతి త్వరలోనే టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఐదు టెస్టుల

London: ప్రాక్టీస్ కు డుమ్మా..కోహ్లీ ఇంట్లో టీమిండియా ప్లేయర్ల దావత్ !
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య అతి త్వరలోనే టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఐదు టెస్టుల సిరీస్ కంటే ముందు టీమిండియా ప్లేయర్లు రిలాక్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. ఇంటికి వెళ్లి, ఎంజాయ్ చేశారట గిల్, ఇతర ఆటగాళ్లు. ప్రస్తుతం లండన్ లోనే విరాట్ కోహ్లీ దంపతులు ఉంటున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఇంగ్లాండ్ లోనే టీమ్ ఇండియా ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో... కొంత మందిని దావత్ కు పిలిచాడట విరాట్ కోహ్లీ. ఈ తరుణంలోనే టీమిండియా కొత్త కెప్టెన్ గిల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్ ఇతర ప్లేయర్లు కూడా.. లండన్ లోని విరాట్ కోహ్లీ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఇంట్లో... మంచి పార్టీ చేసుకున్నారట టీమ్ ఇండియా ప్లేయర్లు. ఇండియన్ స్టైల్ ఫుడ్ తింటూ... చుక్క ముక్క వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారట. అయితే ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ పెట్టుకుని.. ప్రాక్టీస్ ఎగ్గొట్టి మరి ఎంజాయ్ చేశారా? అని ఫైర్ అవుతున్నారు. కోహ్లీతో ఎప్పుడైనా పార్టీలు చేసుకోవచ్చు.. కానీ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే మాత్రం మీకు ఉంటుంది అని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

Twitter Link

Next Story