కోహ్లీ, రుతురాజ్ సెంచరీల మోత‌

by velandi.Saikiran |   (  Updated:2025-12-03 11:12:20  IST  )

మొదట రుతురాజ్ సెంచరీ చేయగా, ఇప్పుడు కోహ్లీ కూడా తన సెంచరీ నమోదు చేసుకున్నాడు

కోహ్లీ, రుతురాజ్ సెంచరీల మోత‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో మనోళ్లు ఇరగదీస్తున్నారు. కింగ్ కోహ్లీతో పాటు కొత్త ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు సెంచరీలు నమోదు చేశారు. మొదట రుతురాజ్ సెంచరీ చేయగా, ఇప్పుడు కోహ్లీ కూడా తన సెంచరీ నమోదు చేసుకున్నాడు. అయితే, ఇద్ద‌రూ సెంచ‌రీలు చేసుకున్న త‌ర్వాత వికెట్లు స‌మ‌ర్పించుకున్నారు. ఇక‌ 93 బంతుల్లో 102 పరుగులు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, వెంటనే లుంగీ ఎంగిడీ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

అటు రుతురాజు గైక్వాడ్ కూడా 83 బంతుల్లో 105 పరుగులు సాధించి మార్కో జాన్సన్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 40 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 284 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక అంతకు ముందు టాస్ ఓడిపోయిన భారత జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది. ఈ నేపథ్యంలోనే యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా దిగారు. రోహిత్ శర్మ 14 పరుగులకు వికెట్ సమర్పించుకోగా యశస్వి జైస్వాల్ మరోసారి విఫలమై, 22 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.

Next Story