Virat Kohli : కింగ్ ఆగయా..కోహ్లీ రాకతో కిక్కిరిసిపోయిన స్టేడియం

by Y. Venkata Narasimha Reddy |

భారత్ స్టార్ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సుదీర్ఘ విరామం అనంతరం దేశవాళీ రంజీ మ్యాచ్(Ranji match)లో ఆడేందుకు మైదానంలోకి దిగాడు.

Virat Kohli : కింగ్ ఆగయా..కోహ్లీ రాకతో కిక్కిరిసిపోయిన స్టేడియం
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ స్టార్ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సుదీర్ఘ విరామం అనంతరం దేశవాళీ రంజీ మ్యాచ్(Ranji match)లో ఆడేందుకు మైదానంలోకి దిగాడు. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రైల్వేస్(Railways vs Delhiతో గురువారం ప్రారంభమైన గ్రూప్ డీ చివరి రౌండ్ రంజీ మ్యాచ్ లో కోహ్లీ ఢిల్లీ జట్టు తరుపున ఆడుతున్నాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లి ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడనుండటంతో అరుణ్ జైట్లీ స్టేడియానికి వేలాది మంది అభిమానులకు క్యూ కట్టారు. దీంతో ఆ ప్రాంతం అభిమానులతో కిక్కిరిసిపోయింది.

అయితే అభిమానుల తోపులాటల మధ్య పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. కోహ్లీ..కోహ్లీ అంటూ అభిమానుల కేరింతలు మధ్య రంజీ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ను ఉచితంగా తిలకించేందుకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రేక్షకులకు అనుమతించింది. అలాగే బీసీసీఐ సైతం ఈ మ్యాచ్ ను జీయో సినిమా చానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే రైల్వేస్ జట్టు తడబడగా 6.1ఓవర్లలో 21పరుగులకే 3ప్రధాన వికెట్లు కోల్పోయింంది. అంకిత్ యాదవ్ 7, వివేక్ సింగ్ 0, సూరజ్ అహుజా 14పరుగులకే అవుటయ్యారు.

19.4ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 66పరుగులతో రైల్వేస్ ఆట కొనసాగిస్తోంది. మహ్మద్ సైఫ్ 24పరుగులకు పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే వచ్చిన భార్గవ్ మిరాయ్ (0)కే అవుటయ్యాడు. వారిద్ధరిని మనీ గ్రెవాల్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఉపేంద్ర యాదవ్ 9పరుగులతో, కరణ్ శర్మ 0పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఢిల్లీ బౌలర్లలో సిద్ధాంత శర్మ, మనీ గ్రెవాల్ తలో రెండు, నవదీస్ సైనీ 1 వికెట్ పడగొట్టారు. మరోవైపు కర్ణాటక తో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో హర్యానా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కర్ణాటక తరుపు కేఎల్ రాహుల్ ఆడుతున్నారు.

Next Story