- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచకప్‌లో ఓటమి ఎఫెక్ట్: పాకిస్తాన్ జట్టులో కీలక వ్యక్తి రాజీనామా
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన ఆ దేశ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు(Pakistan Cricket Team) పేలవ ప్రదర్శన ఆ దేశ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు సృష్టిస్తోంది. టోర్నీలో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడు, మాజీ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ అలీమ్ దార్(Aleem Dar) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)కి సమర్పించారు.
కోచ్‌తో విభేదాలే కారణమా?
అలీమ్ దార్ రాజీనామా వెనుక జట్టు హెడ్ కోచ్ మైక్ హెసన్‌తో ఉన్న విభేదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జట్టు ఎంపికలో కోచ్‌కు మితిమీరిన అధికారాలు ఇవ్వడంపై దార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఫామ్‌లో లేని ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
వివాదానికి దారితీసిన అంశాలు..
సరైన ప్రదర్శన లేకపోయినప్పటికీ బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్‌లను జట్టులోకి తీసుకోవాలని కోచ్ హెసన్ పట్టుబట్టారు. దీనిని అలీమ్ దార్ తీవ్రంగా వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. అనుభవం లేని ఉస్మాన్ ఖాన్ కంటే, సీనియర్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌ను జట్టులో చేర్చాలని దార్ సూచించారు. అయితే దీనికి కెప్టెన్ సల్మాన్ ఆఘా గానీ, ఇతర సెలక్టర్లు గానీ మద్దతు తెలపకపోవడంతో ఆయన కలత చెందినట్లు తెలుస్తోంది.
ముగిసిన ప్రపంచకప్ ప్రయాణం..
ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ప్రదర్శన అత్యంత నిరాశాజనకంగా సాగింది. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాటు ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. సూపర్-8 దశలో న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం కాగా, చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచినప్పటికీ సెమీఫైనల్ చేరే అవకాశాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం అలీమ్ దార్ రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించాల్సి ఉంది. మరోవైపు, జట్టు ఘోర వైఫల్యంపై పాక్ ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో పాక్ క్రికెట్‌లో మరిన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.






