- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ అంటే అందుకే అంత ప్రేమ.. నా మనసు ఆ దేశానికిచ్చా: కెవిన్ పీటర్సన్
భారత్ అంటే తనకు ఎందుకు పిచ్చి అభిమానమో ఇంగ్లండ్ మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్ వెల్లడించాడు. భారతీయుల ప్రేమ చూసి తన మనసు ఈ దేశానికిచ్చినట్లు చెప్పాడు.

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ వేదికలపై భారత్‌కు మద్దతుగా నిలిచే ప్లేయర్లలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ ఒకడు. ఈ విషయంలో అతనిపై తాజాగా ట్రోలింగ్ జరిగింది. ఎప్పుడూ టీమిండియాను సపోర్ట్ చేస్తాడంటూ అతనిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. వీటికి సూటిగా బదులిచ్చిన పీటర్సన్.. తనకు భారత్‌లో ఎప్పుడూ విమర్శలు, అగౌరవం ఎదురుకాలేదని వెల్లడించాడు. తనకు భారత్‌లో లభించే గౌరవం వల్లనే తను భారత్‌కు మద్దతిస్తానని చెప్పుకొచ్చాడు.
‘నేను ఎప్పుడూ ప్రో-ఇండియాగా ఎందుకు కనిపిస్తానని చాలామంది అడిగారు. నా సమాధానం చాలా సింపుల్. 20 ఏళ్లలో డజన్లసార్లు నేను భారత్ వెళ్లా. ఇన్నిసార్లలో ఒక్కసారి కూడా అక్కడ అగౌరవం, నెగిటివిటీ, వెన్నుపోటు వంటి చెడ్డవిషయాలు నేను ఎదుర్కోలేదు. ప్రతిసారీ కేవలం ప్రేమ, దయ, మద్దతు, అభిమానం, గౌరవం మాత్రమే ఎదురయ్యాయి. జీవితాంతం ఉండిపోయే స్నేహితులను అక్కడే పొందా. వాళ్లు నా కుటుంబంగా, సోదరులుగా మారారు’ అని పీటర్సన్ వివరించాడు. గౌరవం అనేది కష్టపడి సాధించాల్సిందేనని, తను ఏళ్ల తరబడి మంచి క్రికెట్ ఆడి ఆ గౌరవాన్ని పొందానని చెప్పాడు.
భారత్‌పై అయినా, ఐపీఎల్‌లో అయినా తన ఆటతోనే ఈ గౌరవం పొందానన్నాడు. అలాగే ఒక దేశంలోని ప్రజలు మన జీవితాంతం పాజిటివ్ అనుభవాలే అందించినప్పుడు, వారికి ఆ ప్రేమను పదింతలు పొందుతారని వివరించాడు. ‘భారత్ ముందుగా తన మనసును నాకిచ్చింది. కాబట్టి నా మనసు ఎప్పుడూ భారత్‌కు ఇస్తూనే ఉంటా. ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని పీటర్సన్ వెల్లడించాడు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇండియన్ అభిమానులు కేపీపై మరోసారి తమ అభిమానాన్ని ఈ పోస్టుకు కామెంట్లు పెట్టి చాటుకుంటున్నారు.






