ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్.. అతను ఎవరో తెలుసా?

by Harish |

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌‌ ఐపీఎల్‌లో తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌ గూటికి చేరాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్.. అతను ఎవరో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌‌ ఐపీఎల్‌లో తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌ గూటికి చేరాడు. వచ్చే సీజన్‌లో అతను ఢిల్లీకి మెంటార్‌గా వ్యవహరించబోతున్నాడు.పీటర్స్ నియామకాన్ని ఫ్రాంచైజీ గురువారం వెల్లడించింది. గతంలో పీటరన్స్ 2012-14 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో ఢిల్లీ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. 2016లో చివరిసారిగా ఐపీఎల్ ఆడాడు. వచ్చే సీజన్‌లో హెడ్ కోచ్ హేమంగ్ బదానితో కలిసి పనిచేయనున్నాడు. అయితే, ఐపీఎల్‌లో కోచ్‌గా వ్యవహరించడం పీటర్సన్‌కు ఇదే తొలిసారి. ఢిల్లీకి మెంటార్‌గా నియామకమవడంపై పీటర్సన్ స్పందిస్తూ..‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా నా కొత్త పాత్రను పోషించడం ఉత్తేజకరమైన అవకాశం. టైటిల్ గెలవడానికి నేను చేయాల్సినందంత చేస్తా.’ అని చెప్పాడు. కాగా, వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఎలాగైనా తొలి టైటిల్ నిరీక్షణకు తెరదించాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నది. అందుకు కోసం కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేపట్టింది. ఇప్పటికే రికీ పాంటింగ్ స్థానంలో హెడ్ కోచ్‌గా హేమంగ్ బదాని, గంగూలీ స్థానంలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వేణుగోపాల్ రావును భర్తీ చేసిన ఫ్రాంచైజీ బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్‌ను, అసిస్టెంట్ కోచ్‌గా మాథ్యూ మోటెను తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ ఇంకా తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంది.


Next Story