Kavya Maran : SRH నుంచి ఆ 6 గురు ప్లేయర్లు ఔట్..లిస్ట్ లో షమీ కూడా!

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad team

Kavya Maran :  SRH నుంచి ఆ 6 గురు ప్లేయర్లు ఔట్..లిస్ట్ లో షమీ కూడా!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad team ) అత్యంత దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే విఫలమైన హైదరాబాద్ జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు ఆ జట్టు ఓనర్ కావ్య ( Kavya maran)... రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే 2026 సీజన్ ( IPl 2026) కోసం ఇప్పటి నుంచే జట్టుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు... మొన్నటి సీజన్ ఆడిన కొంత మంది ప్లేయర్లపై... వేటు వేసేందుకు కావ్య పాప సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటి నుంచే వేట మొదలు పెట్టారట. ఈ లిస్టులో మొత్తం ఆరుగురు ప్లేయర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మహమ్మద్ షమీ అలాగే ఇషాన్ కిషన్ ఇద్దరిపై కూడా వేటు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు.

ఆస్ట్రేలియా ఆటగాడు ఆడం జంపా ( Adam Zampa) కూడా.. మొన్నటి టోర్నమెంటులో అర్ధాంతరంగా.. వెళ్లిపోయాడు. అతనిపై కూడా వేటుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాహుల్ చాహర్ , జీసస్ అన్సారీ, అభినవ్ మనోహర్ లాంటి ప్లేయర్లను కూడా వదులుకునేందుకు హైదరాబాద్ యాజమాన్యం సిద్ధమైనట్లు చెబుతున్నారు. అయితే వీళ్ళ స్థానంలో... యావరేజ్ బాగా ఉన్న ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు కావ్య సిద్ధమైనదట. దీనికోసం కోచ్ అలాగే కెప్టెన్ కమిన్స్ సలహాల మేరకు ముందుకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.

Next Story