- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8 ఏళ్లకే తైక్వాండోలో చెలరేగిన చిచ్చరపిడుగు..
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని ఉప్పల్ కు చెందిన 8 ఏళ్ల కట్కూరి ప్రణీత్ నందన్ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ లో పాల్గొని కాంస్య పతకం సాధించాడు.

X
దిశ, స్పోర్ట్స్ : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని ఉప్పల్ కు చెందిన 8 ఏళ్ల కట్కూరి ప్రణీత్ నందన్ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ లో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా తరఫున 3వ తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ తైక్వాండో ఛాంపియన్షిప్-2025లో సబ్ జూనియర్ బాయ్స్ (25 కిలోల) కేటగిరీలో ప్రణీత్ కాంస్య పతకం అందుకున్నాడు. ఈనెల 12 నుంచి 14 తేదీల్లో జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల్ కేంద్రంలో ఈ పోటీలు జరిగాయి. బోడుప్పల్ లోని పల్లవి మోడల్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న కె.ప్రణీత్ నందన్ గత ఏడాది కాలంగా ఒలింపిక్ క్రీడ అయిన తైక్వాండోలో కోచ్ పితాని చైతన్య దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రణీత్ నందన్ గతంలో మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల స్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణం, రజత పతకాలూ సాధించాడు.
Next Story






