- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kashvee Gautam: ముక్కోణపు సిరీస్‌కు కాశ్వీ దూరం.. యూపీ వారియర్స్ ఆల్‌రౌండర్‌కు పిలుపు!
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ నుంచి టీమిండియా ఆల్‌రౌండర్ కాశ్వీ గౌతమ్ తప్పుకుంది. ఆమె స్థానాన్ని క్రాంతి గౌడ్‌తో భర్తీ చేయనున్నారు.

దిశ, స్పోర్ట్స్: భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్దే సిరీస్ నుంచి టీమిండియా ఆల్‌రౌండర్ కాశ్వీ గౌతమ్ (Kashvee Gautam) తప్పుకుంది. ఈ సిరీస్‌లోనే కాశ్వీ అంతర్జాతీయ అరంగేంట్రం చేసింది. ఆడిన మూడు మ్యాచుల్లో వికెట్లేమీ తీసుకోకుండా, కేవలం 22 పరుగులే చేసింది. కాలికి గాయం అవడంతో ఆమె ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు, ఆమె స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన క్రాంతి గౌడ్‌ను (Kranti Goud) తీసుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్ తరఫున ఆడిన క్రాంతి.. 8 మ్యాచుల్లో ఆరు వికెట్లతో రాణించింది. ఇక, ఈ సిరీసులో వరుసగా రెండు మ్యాచులు గెలిచిన భారత మహిళలు.. తమ చివరి మ్యాచులో శ్రీలంక చేతిలో ఓటమి చవిచూశారు. ఇది 2018 తర్వాత శ్రీలంక చేతిలో భారత మహిళలకు తొలి ఓటమి. కాగా, భారత జట్టు బుధవారం నాడు సౌతాఫ్రికాతో తదుపరి మ్యాచ్ ఆడనుంది.






