- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరుణ్ ను టార్చర్ చేస్తున్న టీమిండియా ప్లేయర్...రిటైర్మెంట్ ఇవ్వాలంటూ!
రీ ఎంట్రీ లో అదరగొడుతున్న టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్

దిశ, వెబ్ డెస్క్: రీ ఎంట్రీ లో అదరగొడుతున్న టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ ఇచ్చేయ్.. అంటూ తనను ఓ క్రికెటర్ వేధిస్తున్నాడని.. తాజాగా బాంబు పేల్చాడు కరుణ్ నాయర్. టీమిండియా స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్... రీ ఎంట్రీ లో దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. దేశవాళి క్రికెట్ లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్... ఆటతీరును గుర్తించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI)... అతన్ని టీమిండియాలోకి (Team India) తీసుకుంది.
త్వరలోనే ప్రారంభం కానున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ లో పాల్గొనబోతున్నాడు కరుణ్ నాయర్. అయితే ఈ నేపథ్యంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కరుణ్ నాయర్. రెండు సంవత్సరాల కిందట ఓ ప్రముఖ క్రికెటర్ తనను రిటైర్... కావాలని.. వేధించేవాడని వెల్లడించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలితో సంబంధాలు తెంచుకుంటేనే విదేశీ టి20 లీగ్స్ ఆడగలుగుతామని అతడు సలహా ఇచ్చాడట.
రిటైర్ అయితేనే డబ్బు సంపాదించుకోవచ్చని... సదరు టీమిండియా క్రికెటర్ చెప్పినట్లు.. కరుణ్ నాయర్ గుర్తు చేసుకున్నారు. కానీ లక్ష్యాన్ని వదులుకున్నందుకు... నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను... అందుకే రియంట్రి కోసం కృషి చేశానని వెల్లడించాడు. కాగా 8 సంవత్సరాల తర్వాత టీమిండియాలోకి కరుణ లాయర్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రాతినిధ్యం వహించాడు.






