- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లాండ్‌తో వన్డేలకు కరుణ్ నాయర్‌ను తీసుకోండి : వెంకటేశ్ ప్రసాద్
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ విధ్వంసకర ఆటతీరు కనబరుస్తున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ విధ్వంసకర ఆటతీరు కనబరుస్తున్నాడు. టోర్నీలో ప్రస్తుతం 752 రన్స్‌తో టోర్నీలో అత్యధిక పరుగులు చేసింది అతనే. 7 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉండటం విశేషం. దీంతో కరుణ్ నాయర్‌ను తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలని పలువురు సెలెక్టర్లకు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా కరుణ్ నాయర్‌కు మద్దతు నిలిచాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయాలన్నాడు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ‘దేశవాళీ క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. నాయర్ దేశవాళీ వన్డే సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతనికి 33 ఏళ్లు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్‌తో వన్డేల్లో నాయర్ ఆడటం చూడటానికి బాగుంటుంది. దీనివల్ల దేశవాళీ క్రికెట్ ఆడాలని, రాణించాలని ఆటగాళ్లను ప్రోత్సహించినట్టు ఉంటుంది.’ అని ప్రసాద్ రాసుకొచ్చాడు. కాగా, 2016లో టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేసిన 6 టెస్టుల, 2 వన్డేలు ఆడాడు. ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో జాతీయ జట్టుకు దూరమైన అతను ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం అదరగొట్టి ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు.
- Tags
- #Karun Nair






