- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియాలో అందరూ దద్దమ్మలే..కరుణ్ నాయర్ సీరియస్ !
టీమిండియా ప్లేయర్లపై కరుణ్ నాయర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీమిండియా ప్లేయర్లందరూ విఫలమైతే.. నేను ఒక్కడినే జట్ట

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా ప్లేయర్లపై కరుణ్ నాయర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీమిండియా ప్లేయర్లందరూ విఫలమైతే.. నేను ఒక్కడినే జట్టును గెలిపించానని వ్యాఖ్యానించారు కరుణ్ నాయర్. టీమిండియాలో అందరూ దద్దమ్మలే అన్న రేంజ్ లో స్పందించాడు కరుణ్. వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును తాజాగా చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ప్రకటించారు. అయితే ఈ లిస్టులో కరుణ్ నాయర్ కు ఛాన్స్ దక్కలేదు. దీనిపై అగార్కర్ క్లారిటీ... కూడా ఇచ్చారు. ఇంగ్లాండ్ సిరీస్ లో కరుణ్ నాయర్ నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించాం... కానీ అతడు విఫలమయ్యాడని తెలిపారు.
కరుణ్ నాయర్ కంటే పడిక్కల్ ఇప్పుడు బెటర్ అనిపిస్తోంది... టీమిండియా - ఏ జట్టులో కూడా అద్భుతంగా ఆడాడు.. అందుకే కరుణ్ నాయక్ ను పక్కకు పెట్టి... పడిక్కల్ కు అవకాశం ఇస్తున్నట్లు అగార్కర్ క్లారిటీ ఇచ్చారు. అయితే అగార్కర్ చేసిన వ్యాఖ్యలకు కరుణ్ నాయర్ కౌంటర్ ఇచ్చారు. సెలక్షన్ కమిటీ తనకు అన్యాయం చేసిందని కరుణ్ నాయర్ ఎమోషనల్ అయ్యారు.
టెస్టులకు ఎంపిక అవుతానని ముందే భావించాను... కానీ తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెలెక్టర్లు ఏం ఆలోచించారో.. తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ పై చివరి టెస్టులో ఎవరు ఆడకపోయినా నేను మాత్రం హాఫ్ సెంచరీ చేశానని గుర్తు చేశారు. దాంతో టీమిండియా గెలిచిందన్నారు. అయినా కూడా నన్ను సెలక్ట్ చేయలేదని ఫైర్ అయ్యారు కరుణ్ నాయర్.






