Karun Nair: నా ఇన్నింగ్స్‌కు విలువే లేదు.. కరుణ్‌ నాయర్ షాకింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ఐపీఎల్-2025 (IPL-2025)లో భాగంగా ఆదివారం ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ (Arun Jaitley) స్టేడియం వేదికగా ముంబాయ్ ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capital) జట్లు తలపడ్డాయి.

Karun Nair: నా ఇన్నింగ్స్‌కు విలువే లేదు.. కరుణ్‌ నాయర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2025 (IPL-2025)లో భాగంగా ఆదివారం ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ (Arun Jaitley) స్టేడియం వేదికగా ముంబాయ్ ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capital) జట్లు తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబాయ్ జట్టు 12 పరుగులు తేడాతో విజయం సాధించింది. అయితే, అంతకు ముందు టాస్ గెలిచిన ఢిల్లీ ఫిల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్‌ వర్మ (59), నమన్‌ ధీర్‌ (38) ధాటిగా ఆడి పరుగులు వేగంగా రాబట్టారు. అదేవిధంగా రికిల్‌టన్‌ (41), సూర్యకుమార్‌ (40) పరుగులతో జట్టు భారీ స్కోర్ చేయండి తమ సహకారం అందించారు.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్ (Delhi Capitals) బ్యాట్స్‌మెన్లు ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ కరుణ్‌ నాయర్‌ (40 బంతుల్లో 89 పరుగులు) చెలరేగి ఆడినా జట్టు ఓటమి పాలైంది. అయితే, విజయానికి చివరి 9 బంతుల్లో 15 పరుగులు అవసరమైన సమయంలో వరుసగా మూడు బంతుల్లో ముగ్గురు బ్యాటర్లు రనౌట్‌ అయ్యారు. దీంతో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులు చేసి ఆలౌట్ అవ్వడతో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే తమ జట్టు గెలవకపోవడంపై ఢిల్లీ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కష్టపడి ఆడిన తన ఇన్నింగ్స్‌కు విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు. రాబోయే మ్యాచ్‌లలోనైనా అనవసర తప్పిదాలు చేసి వికెట్లు కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని కరుణ్ నాయర్ అన్నాడు.

Next Story