ఇండియా-ఎ టీం ఇదే.. కరుణ్ నాయర్‌కు పిలుపు

by Phanindra |   (  Updated:2025-05-16 16:55:54  IST  )

ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే ఇండియా-ఎ టీంను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో కరుణ్ నాయర్, సర్ఫరాజ్‌ను ఎంపిక చేసింది.

ఇండియా-ఎ టీం ఇదే.. కరుణ్ నాయర్‌కు పిలుపు
X

దిశ, స్పోర్ట్స్: దేశవాళీల్లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్‌కు బీసీసీఐ సెలెక్టర్లు అరుదైన అవకాశం ఇచ్చారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆ దేశంలో ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడేందుకు 18 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో నాయర్‌కు చోటుదక్కింది. అతనితోపాటు జార్ఖండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌, వెటరన్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, సర్ఫరాజ్ ఖాన్‌ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యారు. చోటుదక్కింది. తమిళనాడు ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ ఈ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ ఇద్దరూ టెస్టులకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో టీమిండియాలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాల కోసం ఈశ్వరన్, నాయర్, రుతురాజ్, సర్ఫరాజ్ మధ్య ప్రధానంగా పోటీ ఉంది.

ఇంగ్లండ్‌లో ఇండియా-ఎ జట్టు రెండు మ్యాచులు ఆడనుంది. మే 30 నుంచి జూన్ 2 వరకు కాంటెర్‌బరీలో మొదటి మ్యాచ్ జరుగుతుంది. నార్తాంప్టన్ వేదికగా జూన్ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రెండో మ్యాచ్ జరగనుంది. అనంతరం బెకెన్‌హం వేదికగా జూన్ 13 నుంచి 16 వరకు ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ జరుగుతుంది.

ఇండియా-ఎ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతర్, తనుష్ కోటియాన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే.

Next Story