- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నస్వామి స్టేడియంపై కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం !
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ( Chinnaswamy Stadium) విషయంలో కర్ణాటక ప్రభుత్వం ( Karnataka Government) కీలక

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ( Chinnaswamy Stadium) విషయంలో కర్ణాటక ప్రభుత్వం ( Karnataka Government) కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నస్వామి స్టేడియాన్ని... తరలించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం 30 వేల నుంచి 35 వేల మంది కెపాసిటీ మాత్రమే బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో పడతారన్న సంగతి తెలిసిందే.
అయితే కెపాసిటీ తక్కువగా ఉన్న నేపథ్యంలోనే మొన్న బుధవారం రోజున తొక్కిసలాట జరిగిందని ఓ నివేదిక బయటకు వచ్చిందట. అలాగే సిటీలోనే స్టేడియం ఉండడంతో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతోందని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... బెంగళూరు చిన్న స్వామి స్టేడియాన్ని.. మరో ప్రదేశానికి తరలించే యోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు.
బెంగళూరు సిటీ ఔట్ కట్స్ లో చిన్న స్వామి స్టేడియాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ... సోషల్ మీడియాలో మాత్రం కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా బెంగళూరు వచ్చిన స్వామి స్టేడియంలో మొన్న తొక్కి సలాట జరిగి 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 33 మంది ఆసుపత్రి పాలయ్యారు. మరి కొంతమంది ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.






