- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCB: బెంగళూరు తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు పరిహారం పెంపు
బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో... 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును చాలా

X
దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో... 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును చాలా సీరియస్ గానే వ్యవహరిస్తోంది కర్ణాటక సర్కార్. ఈ సంఘటనకు కారణమైన ఒక్కొక్కరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం.
చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో మరణించిన వారి కుటుంబాలకు.. ఇచ్చే ఆర్థిక సహాయాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొదట పది లక్షలు ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం... ఇప్పుడు రూ. 25 లక్షలకు పెంచింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం 10 లక్షలు ఇవ్వనుంది. అటు కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Next Story






