ల‌క్నో జ‌ట్టులో పెను మార్పులు..రంగంలోకి కేన్ మామ‌!

by velandi.Saikiran |

కేన్ మామ పై కన్ను వేసింది లక్నో జట్టు యాజమాన్యం. గత ఏడాది అన్ సోల్డ్‌ ప్లేయర్ గా మిగిలిపోయిన కేన్ మామ

ల‌క్నో జ‌ట్టులో పెను మార్పులు..రంగంలోకి కేన్ మామ‌!
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం ఇప్పటి నుంచే 10 ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ లో మినీ వేలం ఉన్న నేపథ్యంలో, తమ జట్టుకు కావాల్సిన వాళ్లను ఇప్పటినుంచే అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేన్ మామ పై కన్ను వేసింది లక్నో జట్టు యాజమాన్యం. గత ఏడాది అన్ సోల్డ్‌ ప్లేయర్ గా మిగిలిపోయిన కేన్ మామ కోసం బిగ్ స్కెచ్ వేసింది. డిసెంబర్ లో జరిగే మినీ యాక్షన్ లో కేన్ మామ సేవలను వినియోగించుకునేందుకు ప్లాన్ వేసింది.

ఇందులో భాగంగానే తాజాగా కేన్ మామతో జట్టు యాజమాన్యం చర్చలు చేసినట్లు తెలుస్తోంది. లక్నో స్ట్రాటజిక్ అడ్వైజర్ గా అతనిని ఎంపిక చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి కేన్ మామ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జహీర్ ఖాన్ ఇటీవలే లక్నో జట్టు నుంచి తప్పుకున్నారు. అతని స్థానంలో ఇప్పుడు కేన్ మామ వస్తున్నాడు. మరి కేన్ మామ రంగంలోకి దిగిన తర్వాత లక్నో జట్టు రాత మారుతుందా? చూడాలి. ఇది ఇలా ఉండగా సన్రైజర్స్ హైదరాబాద్ అలాగే గుజరాత్ టైటాన్స్ కు గతంలో సేవలు అందించాడు కేన్ మామ.

Next Story